మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరుకు చెందిన హనుమంతు అనారోగ్యంతో బాధపడుతూ, శనివారం ఉదయం 11 గంటలకు పంట పొలంలో ఉపయోగించే పురుగుమందు త్రాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం హనుమంతు ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.