ఆదోనిలో కురిసిన అకాలవర్షం కారణంగా రైతులు రోడ్డున పడ్డారు. ఆలూరు నియోజకవర్గం నేరణికి తండాకు చెందిన నాగరాజు నాయక్ 42 సంచుల వేరుశనగ, తుగ్గలి మండలం ఎద్దులదొడ్డికి చెందిన పెద్దరంగన్న 95 సంచుల వేరుశనగ పూర్తిగా వర్షపు నీటిలో కళ్లముందే కొట్టుకొని పోవడం రైతులు శనివారం కన్నీరు పెట్టుకున్నారు. అకాల వర్షంతో నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.