పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి చొరవ చూపాలని మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఛైర్మన్, అడిషనల్ డిస్టిక్ కోర్టు జడ్జి పీజే సుధా తెలిపారు. శనివారం ఆదోని కోర్టు హాల్లో మెగా లోక్ అదాలత్ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 14న జరిగే అదాలత్లో ఎక్కువ మంది కక్షిదారులు హాజరయ్యేలా చూడాలన్నారు. చిన్న సమస్యలు కూడా పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.