ఆదోనిలో కొత్త పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డీవైఎఫ్ఐ మాజీ డివిజన్ కార్యదర్శి లక్ష్మన్న ఆదివారం తెలిపారు. డీవైఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదోనిలోని తిక్క స్వామి దర్గా ఏరియా నందు డివైఎఫ్ఎ జెండాను నాయకులు వీరేష్ ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక సూదురా ప్రాంతాలకు వలస వెళ్లుతున్నారని పేర్కొన్నారు.