ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో జరిగిన విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో భాగంగా బోడబండ, ముగతి, గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు మండలంలోని పలు గ్రామాల్లో టిడిపి వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన చైర్మన్, వైస్ చైర్మన్ లకు శాసనసభ్యులు డా. బివి జయ నాగేశ్వర్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.