ఎమ్మిగనూరు మండల పరిధిలోని బోడబండ గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి జి. నల్లారెడ్డి యాదవ్ గురువారం డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరు ఆర్టీసీ అధికారులకు విద్యార్థులతో కలసి వినతిపత్రం అందజేశారు. పేద గ్రామీణ ప్రాంతాలే విద్యార్థులకు స్కూల్, కాలేజ్ సమయాలకు బస్సు సౌకర్యం లేక నానా అగచాట్లు పడుతున్నారని తెలిపారు.