అనుదిన జీవితంలో స్వచ్ఛత అనేది ఒక భాగం కావాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. మంగళవారం ఆదోని మండలం మండిగిరి పంచాయితీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వచ్ఛత హి సేవా 2024 కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులతో కలసి పాల్గొన్నారు. చిన్న వయస్సులో నుండే స్వచ్ఛతను అలవరచుకోవాలి అన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటేనే ఎలాంటి అనారోగ్యాలు రావు అని అన్నారు.