డ్వాక్రా సంఘాలకు మరింత చేయూతనిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు.విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులోని అమరావతి కన్వెన్షన్ హాల్ లో మెప్మా స్వయం సహాయక సంఘాల ప్రొఫైలింగ్ యాప్ పై ఒకరోజు శిక్షణా కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ వర్క్ షాపుకి మంత్రి పి. నారాయణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.