విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ను నియంత్రించడం, నేరాలును ఛేదించడం, శాంతిభద్రతల పరిరక్షణలో మరియు వివిధ వి. ఐ. పి ల బందోబస్తులలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలను ఉపయోగించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో శనివారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజశేఖర్ బాబు ప్రత్యేకంగా మహిళా పోలీస్ కానిస్టేబుల్ లకు డ్రోన్ ఆపరేట్ చేసే విధంగా శిక్షణ ఇవ్వడం జరిగింది.