విజయవాడలోని పటమట 11వ డివిజన్లోని వివేకానంద కాలనీలో మంగళవారం టీడీపీ పార్టీ నాయకులు, యువజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బెజవాడ నజీర్ సమక్షంలో మలేరియా అధికారులు ఫాగింగ్ నిర్వహించి, సైడ్ కాలవల్లో ఆయిల్ బాల్స్ వదిలారు. ఈ సందర్భంగా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దృష్టికి వెళ్లిన వెంటనే స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని, ఆయనకు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నందుకు కొనియాడారు.