ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నూతనంగా నియమించబడిన శ్రీ రుద్ర కోటి సదాశివంకు పెనమలూరు నియోజకవర్గ నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు విజయవాడలో సోమవారం ఘనంగా సత్కరించారు. అలాగే ఉమ్మడి కృష్ణాజిల్లా నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ నాగరాజు, గుంటూరు జిల్లా డైరెక్టర్లు గంగాధర్, శివ శేషగిరి రావు, కర్నూలు నంద్యాల జిల్లాల డైరెక్టర్ విజయకుమార్ లను సుబ్బారావు తదితరులు సన్మానించారు.