పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు మండలం పునాదిపాడు హైస్కూల్ లో బుధవారం విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లతో పాటు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగంపై అదనపు ఎస్ఐ తాతాచార్యులు అవగాహన కల్పించారు. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలపై అదనపు ఎస్ఐ తాతాచార్యులు పలు సూచనలు చేశారు.