తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం కల్తి జరిగిందని కూటమినేతలు చేస్తున్న అసత్య ప్రచారాలు తొలగించాలని పెడన నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి ఉప్పాల రాము పూజలు చేశారు. పెడన 11వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ పూజలు నిర్వహించినట్టు తెలిపారు.