పేద మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన దీపం పథకంతో మహిళలకు లబ్ధి కలుగుతుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం పెడన పట్టణం నందు నవ్య
భారత్ గ్యాస్ కంపెనీ దగ్గర దీపం 2. 0 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే ప్రారంభించారు. అర్హులైన వారి ఇంటికెళ్లి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించి ఉచిత సిలిండర్ బిగించి పొయ్యి వెలిగించారు.