తెలుగు రాష్ట్రాలలో పగటి పూట దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్థులను ఏలూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ శనివారం వివరాలు వెల్లడించారు. ఏలూరు, ఎన్టీఆర్, ఖమ్మం జిల్లాలలో జరిగిన 28 దొంగతనాలకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకొని, రూ. 44, 20, 000 విలువైన 590 గ్రాముల బంగారం, 1630 గ్రాముల వెండి, మూడు మోటార్ సైకిళ్లు, రూ. 60, 000 నగదు, ఒక సెల్ ఫోన్ ను రికవరీ చేశామన్నారు.