జిల్లాలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కి బ్రీఫింగ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల లో సిబ్బంది గ్రామ స్థాయి లో ఈ విధమైన కార్యక్రమాలు చేయాలి అనే దానిపై జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ విజయ కుమారి దిశానిర్దేశం చేశారు. రైతులు అందరితోనూ నవదాన్యలు వేయించాలని నవ ధాన్యాలు వేయడం వలన నెలకు పునర్జీవం వస్తుందని, వానపాముల వృద్ధి పెరుగుతుందని, చీడపీడలను తట్టుకునే సామర్థ్యం ప్రధాన పంటకు ఏర్పడుతుందని, తదితర ఉపయోగాలు, ప్రయోజనాలను రైతులకు పూర్తిస్థాయిలో వివరించాలని అందరి రైతులతో నవధాన్యాలను వేయించాలని ఆమే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి, సిబ్బంది, క్లస్టర్ స్థాయి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.