ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 6 వరకు మాత్రమే అవకాశం ఉందని నందిగామ శాసనసభ్యుని కార్యాలయం ఆదివారం తెలిపింది. నందిగామ నియోజకవర్గంలోని పట్టభద్రులంతా త్వరగా ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరో 3 రోజుల్లో గడువు ముగియనున్నందున, కావాలసిన వారు త్వరగా చర్యలు తీసుకోవాలని సూచించారు.