మైలవరం మండలంలోని తోలుకోడు గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు శుక్రవారం ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు దవులూరి సురేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు.