మైలవరం నియోజకవర్గం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు 1లక్షతో తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వాన్ని తీసుకున్నారు. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన 1లక్షతో టిడిపి శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు.