వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన ఉమ్మడి కృష్ణా- గుంటూరు జిల్లాల పట్టభధ్రుల శాసనమండలి అభ్యర్థి పూనూరు గౌతమ్ రెడ్డి పరిచయ సమావేశం సోమవారం ఇబ్రహీంపట్నం వైఎస్ఆర్సిపి కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికలలో మోసపూరిత హామీలతో కూటమి అధికారంలోకి వచ్చిందని అన్నారు. కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.