దేశంలోని వివిధ ప్రాంతాలను ఐక్యం చేసి, దాదాపు 557 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని జిల్లా ఎస్పీ అర్. గంగాధర్ రావు అన్నారు. గురువారం ఉదయం భారతదేశ మొదటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు మచిలీపట్నం జిల్లా కోర్ట్ సెంటర్ నుండి పోలీస్ కార్యాలయం వరకు ఏక్తా దివాస్ జాతీయ ఐక్యత దినోత్సవ ర్యాలీని నిర్వహించారు.