ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యలకు సంబంధించి ఏ విద్యార్థికి హాల్ టిక్కెట్లు నిరాకరించకూడదని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ అధికారులను ఆదేశించారు. ఆదివారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యలకు సంబంధించి కొన్ని కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్టికెట్లు ఇవ్వకుండా నిరాకరిస్తున్నాయని జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చిందన్నారు. అలా ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.