చెడుపై మంచి, రాక్షులపై దేవతల విజయానికి ప్రతీక దీపావళి పండుగ అని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బుధవారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ, దీపావళి పండుగ రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. నూతన ఉత్తేజంతో రాష్ట్రం అభివృద్ది బాటలో అడుగులు వేయాలని, ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న ప్రభుత్వానికి దైవ సహకారం ఉండాలన్నారు.