ప్రజా సమస్యల పరిష్కారానికి మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ తెలిపారు. సోమవారం మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మలు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు తీసుకొచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ స్వాతి తదితరులు పాల్గొన్నారు.