ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా నందమూరి కథనాయకులతో పాటు అభిమాన సంఘం అండగా ఉంటుందని ఆల్ ఇండియా ఎన్ బీకే అభిమాన సంఘం అధ్యక్షుడు తిలక్ అన్నారు. నియోజకవర్గ ఎన్బీకే- ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో కోమటిలంకలో వరద బాధిత కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరకులు సోమవారం పంపిణీ చేశారు. నాయకులు వేగిరెడ్డి సురేష్, ఎల్ ఆర్ మోహన్ లు పాల్గొన్నారు. గ్రామస్తులు ఎన్బీకే- ఎన్టీఆర్ అభిమాన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.