టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఇప్పటికే ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని న్యాయస్థానం ఆదేశించింది. దాదాపు మరో నెల జోగి రమేష్ బెయిల్‌పై ఉండనున్నారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు తీసుకోనున్నారు.