జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీరాం తాతయ్య సోమవారం బాదిత కుటుంబానికి 5 లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసి చెక్కును అందజేశారు. జగ్గయ్యపేట రంగస్వామి బజారునకు చెందిన బిల్లకంటి కార్తీక్ ఆరోగ్యం బాగోలేక విజయవాడ అంకుర హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం జరిగింది. ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యని ఆశ్రయించగా తాతయ్య స్పందించి ముఖ్యమంత్రి వద్దకు తీసుకొని వెళ్లి ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్ఓసి మంజూరు చేయించారు.