గుడివాడ నియోజకవర్గంలో ప్రజల త్రాగునీటి, రోడ్ల సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ రాజేంద్రనగర్ లోని తన స్వగృహంలో ఎమ్మెల్యే రాము సోమవారం ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీకరించారు. గుడివాడ నియోజక వర్గంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజానీకం తమ సమస్యలను ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకువచ్చారు.