పామర్రు నియోజకవర్గంలో గురువారం జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన ముగ్గురు మృత దేహాలను గుడివాడ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మృతదేహాలను పెట్టేందుకు ఒకటే ఏ. సి బాక్స్ ఉండటంతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తమ్ముడు కామేపల్లి తులసి బాబు మిగిలిన రెండు మృతదేహాలకు ఏ. సి బాక్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మూడు కుటుంబాలు వారు ఇలా మృత్యువాత పడటం పట్ల విచారం వ్యక్తం చేశారు.