గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలోని నవభారత్ హై స్కూల్ నందు వార్షికోత్సవ వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వి సి ఎస్ అండ్ టి ఏ అధ్యక్షులు చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.బడ్జెట్ పాఠశాలలను ఆదరించాలి.భార్యాభర్తల స్వీయ పర్యవేక్షణలో నిర్వహించే బడ్జెట్ పాఠశాలలను ఆదరించాలని విజయవాడ చిల్డ్రన్స్ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి ముస్తాబాద నవభారత్ హై స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటూ పేర్కొన్నారు. కార్పొరేట్ హంగు ఆర్భాటాలకు ఆకర్షితులు కాకుండా ప్రతి విద్యార్థి ఎడల వ్యక్తిగత శ్రద్ధ కలిగి ఉన్న చిన్న బడ్జెట్ పాఠశాలలను ఆదరించాలని ఆయన తల్లిదండ్రులను కోరారు.
గొల్లనపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ కొల్లి సత్య జగదీశ్వర రావు మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా పాఠశాలను ఎంతో క్రమశిక్షణతో నడుపుతున్నారు అనడానికి నిదర్శనం ఇంతవరకు నిర్వహించిన వివిధ పోటీలలో వారు సాధించిన బహుమతులు మరియు అందరిని అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలే నిదర్శనమని పేర్కొన్నారు. . విజయవాడ చిల్డ్రన్స్ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ గవర్నమెంట్ బాడీ సభ్యులు శ్రీ ఆరుమళ్ళ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల యజమాన్యం ప్రతి విద్యార్థి ఎడల వ్యక్తిగత శ్రద్ధ కనబరుస్తుంది అనడానికి నిదర్శనం గత సంవత్సరం పదవ తరగతి పరీక్షలలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన ఏకైక పాఠశాలగా గన్నవరం మండలంలో నిలవడమేనని పేర్కొన్నారు. ఇటువంటి పాఠశాలలను తల్లిదండ్రులు ఆదరించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ షేక్ ఇమామ్ జాకీర సుల్తానా, అసోసియేషన్ కార్యదర్శి శ్రీ అనుమాటి చెన్నయ్య మండల పరిషత్ సభ్యురాలు శ్రీమతి షేక్ మున్ని, గవర్నింగ్ బాడీ సభ్యులు శ్రీ తాళ్లూరి శ్రీనివాసరావు అసోసియేషన్ సభ్యులు శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి, సురేష్ కుమార్ , శ్రీమతి అనురాధ, శ్రీమతి లక్ష్మీరాజ్య పూర్ణ ,కోటేశ్వరరావు , షేక్ జిలాని, షేక్ ఖాదర్ బాషా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో ముందుగా ప్రీ ప్రైమరీ విద్యార్థులకు కిడ్స్ కాన్వకేషన్ నిర్వహించడం జరిగింది. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో దేశభక్తి గీతాలు క్లాసికల్ డాన్స్ మరియు
విద్యార్థులు నిర్వహించిన ఆడదంటే అబల కాదు సబల అనే స్కిట్, పిరమిడ్స్ మరియు బ్రిక్స్ బ్రేకింగ్ వంటి కార్యక్రమాలు అందర్నీ ఆకర్షించాయి.