గన్నవరం: అర్హులైన వారిని లబ్దిదారులుగా ఎంపిక చేయాలి
రాజకీయాల కతీతంగా అర్హులైన వారిని లబ్దిదారులుగా ఎంపిక చేయాలని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో పని చేసే అన్ని శాఖల ప్రభుత్వ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు.