సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూనే గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు.
మంగళవారం విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో రూ. 37 లక్షలు, ఎనికెపాడులో రూ. 1.03 కోట్లతో నిడమానూరులో రూ. 25 లక్షలు, గూడవల్లిలో రూ. 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కొబ్బరి కాయ కొట్టి శంకుస్థాపనలు చేశారు.