గన్నవరం పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకి దిగారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గన్నవరం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు తుమ్మి ఏసుబాబుపై మహమ్మద్ షబ్బీర్ హుస్సేన్ అనే వ్యక్తి దాడి చేశాడు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఏసుబాబుకి మద్దతుగా కార్మికులు పనులు నిలిపివేసి న్యాయం చేసే వరకు విధులు నిర్వహించమని హెచ్చరించారు.