ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తుందని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గురువారం గన్నవరం నియోజకర్గం ఉంగుటూరు మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన మస్తాన్ వలికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ. 1, 13, 265/- సీఎంఆర్ఎఫ్ చెక్కును అలానే గన్నవరం మండలం సూరంపల్లికి చెందిన కొప్పుల సుశీలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కును భదిత కుటుంబసభ్యులకు అందజేశారు.