గన్నవరం ఎయిర్ పోర్ట్ లో కొత్త టెర్మినల్ నిర్మాణానికి సంబంధించి 2025 జనవరి నాటికి కాంక్రీట్ పనులు పూర్తి అవుతాయి. అనంతరం ఇతర పనులు పూర్తి చేసి జూన్ నాటికి నూతన టెర్మినల్ భవనాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ చెప్పారు. గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమనాశ్రయంలో శనివారం ఎయిర్ పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది.