ఘంటసాల మండల పరిధిలోని పాపవినాశనం ఇసుక క్వారీకి వెళ్లే రహదారిలో గండి కొట్టడంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. తక్షణమే చర్యలు చేపట్టాలని ఘంటసాల మండల తహసిల్దార్ బి. విజయప్రసాద్ కు ఆ గ్రామ ప్రజలు బుధవారం వినతిపత్రం అందజేశారు. గ్రామం నుంచి ఇసుక తోలుకొని వెళ్లేందుకు, ఇతర అవసరాలకు కోసం వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి కావడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.