కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలనీ ఏపీ రైతుసంఘం జిల్లా నాయకులు హనుమానుల సురేంద్రనాధ్ బెనర్జీ, గుత్తికొండ రామరావు డిమాండ్ చేశారు. సోమవారం చల్లపల్లి తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ లతకు వినతిపత్రం సమర్పించారు. 2024 ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రతి రైతుకు రూ. 20వేలు పెట్టుబడి సాయం అందించాలన్నారు.