త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలని తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు మోర్ల శివ పేర్కొన్నారు. శుక్రవారం చల్లపల్లిలోని పలు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులకు ఫారం 18ను అందజేశారు. నవంబర్ 6 లోగా నమోదు గడువు ముగియనుండటంతో త్వరితగతిన నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు నబీ ఘోరీ, తెలుగు యువత సభ్యులు తదితరులు పాల్గొన్నారు.