గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతన పెంపొందించాలని వీ. హెచ్. పీ న్యూఢిల్లీ కేంద్రియ సమరసత కార్యదర్శి దేవ్ భాయ్ రావత్ అన్నారు. అవనిగడ్డ గాలిగోపురం దేవస్థానం ప్రాంగణంలోని గీతా మందిరంలో శుక్రవారం హిందూ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆయన మాట్లాడుతూ, దేవాలయాలు పరిరక్షించుకోవాలని, హిందువులు ఐక్యతగా ఉండాలని, మత మార్పిడిలు నిరోధించాలని కోరారు. ఆర్ఎస్ఎస్ నాయకులు కోలా శ్రీమన్నారాయణ, మండలి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.