బుడమేరు వరద నీటి ముంపు గురించి సాక్షి ఛానల్ మీడియా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై, రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ధ్వజమెత్తారు. శనివారం బుడమేరు వద్ద మీడియాతో మాట్లాడుతూ 2020లో 220 కోట్ల అంచనా వ్యయంతో వైసీపీప్రభుత్వంలో బుడమేరు పనులను భూమిపూజ చేశానన్నారు. 23కోట్ల రూపాయల పనులు పూర్తి కాగానే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆధునికరణ పనులను అర్ధంతరంగా నిలిపివేసిందన్నారు.