భవిష్యత్ అంతా పర్యాటకానిదే అని, పర్యాటక అభివృద్ధిపై ఏపీటీడీసీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఆటోనగర్ లో ఉన్న ఏపీ టీడీసీ ( ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ) కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.