రైతు పండించినటువంటి ప్రతి పంటకు గిట్టుబాటు ధరను కల్పించడం జరుగుతుందని పెనమలూరు శాసనసభ్యులు బోడె ప్రసాద్ తెలిపారు. శుక్రవారం కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బోడె ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.