ఎన్ సి డి సీడీ-3. 0 సర్వేని సద్వినియోగం చేసుకోవాలని కంకిపాడు ప్రభుత్వాసుపత్రి మాజీ చైర్మన్ యలమంచిలి కిషోర్ బాబు పిలుపునిచ్చారు. గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్సిడి-సిడి 3. 0 సర్వేను కంకిపాడులో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషోర్ బాబు మాట్లాడుతూ మధుమేహం, రక్తపోటు, నోటి, బ్రెస్ట్, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలను ప్రతీ ఒక్కరికీ నిర్వహిస్తుందన్నారు.