జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ పెడన నియోజకవర్గం గూడూరు గ్రామంలో శుక్రవారం ఉదయం లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శుల ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.