చల్లపల్లి మండలంలో ఇసుక రీచ్ లు లేవనీ, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని చల్లపల్లి తహసీల్దార్ డి. వనజాక్షి తెలిపారు. చల్లపల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యంతో కలిసి గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం గుర్తించిన ఇసుక రీచ్ ల నుంచీ మాత్రమే ఉచిత ఇసుకను తీసుకువెళ్లాలన్నారు. చల్లపల్లి మండలం సీఆర్జేడ్ పరిధిలో ఉండటంతో ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవన్నారు.