మైలవరం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన నైమిశ ఫిజియోథెరపి అండ్ రీ హెబిలిటేషన్ సెంటర్ ను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు సోమవారం ప్రారంభించారు. మైలవరం పట్టణంలో ఫిజియోథెరపీలో అధునాతన వైద్య సేవలు కైరోప్రాక్టిక్ థెరపి, న్యూరోకైనెటిక థెరపి, ఆస్టియోపతి, మాన్యూవల్ థెరపి, కైసాలజీ, ముల్లిగాన్ టెక్నిక్స్ ఏర్పాటు చేసిన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నాగరాజును అభినందించారు.