మైలవరం పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యులు కృష్ణ ప్రసాదు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ రైతులతో పత్తి దిగుబడులు, గిట్టుబాటు ధర, సీసీఐ నిబంధనల గురించి మాట్లాడారు. రైతులు విక్రయించడానికి తీసుకువచ్చిన పత్తిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీసీఐ బయ్యర్లు, ఎన్డీఏ మహాకూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.