మైలవరం నియోజకవర్గంలో జరగబోవు ఎమ్మెల్సీ ఎలక్షన్ పై అవగాహన కల్పించి, ఓటు నమోదు చేసుకునే కార్యక్రమాన్ని సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆదేశానుసారం మైలవరం కార్యాలయం ఇన్చార్జి నాగ మల్లేశ్వర ఆధ్వర్యంలో కోపరేటివ్ బ్యాంక్ సెంటర్ నందు టెంటు ఏర్పాటు చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పై అవగాహన కల్పించి తమ యొక్క ఓటింగ్ హక్కును ఉపయోగించుకోవాలని సూచించారు.