ఆదివారం ఉదయం మచిలీపట్నం శివారులోని కోన మరియు పరిసర ప్రాంత ప్రజలకు అశ్విని హాస్పిటల్ వారి సౌజన్యంతో డా. తుంగల పవన్ కుమార్ (ఎం. ఎస్ జనరల్ సర్జరీ ), డా. పుషడపు జాహ్నవి (చిన్న పిల్లల వైద్య నిపుణులు) ఆధ్వర్యంలో మెగా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందుల పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో కొన గ్రామ ప్రాంత ప్రజలు, ఆర్ఎంపి లు, తదితరులు పాల్గోన్నారు.