కేంద్ర మంత్రితో భేటీ అయిన మచిలీపట్నం ఎంపి

78பார்த்தது
కేంద్ర మంత్రితో భేటీ అయిన మచిలీపట్నం ఎంపి
కృష్ణా జిల్లా దివిసీమప్రాంత చిరకాల కోరిక అయిన మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ నిర్మాణంపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఢిల్లీలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి శుక్రవారం భేటీ అయ్యారు. ఇప్పటికే ఓ దఫా గత నెలలో రైల్వే మంత్రిని భేటీ అయిన ఎంపీ బాలశౌరి మరోసారి మంత్రిని కలిశారు. ఈ సందర్బంగా మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ నిర్మాణం ఆవశ్యకతను, రూట్‌మ్యాప్‌లను మంత్రికి ఎంపీ అందజేశారు.

தொடர்புடைய செய்தி